తిమ్మమాంబ గ్రామ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం.. ఎమ్మెల్యే

నంబుల పూలకుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను తిమ్మమాంబ గ్రామ మహోత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. ఈ నెల 14, 15, 16 తేదీలలో మూడు రోజుల పాటు ఈశా ఫౌండేషన్ సద్గురు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. తిమ్మమ్మ మర్రిమాను క్షేత్రాన్ని పెద్ద ఎత్తున పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్