కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గురువారం కదిరిలో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమకు వైఎస్ఆర్, జగన్ చేసింది శూన్యమని పేర్కొన్నారు. కృష్ణా నదిలో మిగులు జలాలపై వైఎస్ఆర్ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు లేఖ రాసి రాయలసీమ రైతుల గొంతు కోస్తే, అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మిస్తున్నా జగన్ పట్టించుకోలేదని విమర్శించారు. కృష్ణా జలాల్లో 512 టీఎంసీల నీటిని కేసీఆర్ తో ఒప్పించి చంద్రబాబు సాధిస్తే, సెక్షన్ 3పై చర్చించేలా జగన్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్ లో వాదనలు వినిపించకుండా రాష్ట్రానికి ద్రోహం చేశారని ఆరోపించారు. నేడు తెలంగాణ ప్రభుత్వం నీటి కేటాయింపులపై డిమాండ్ చేస్తుందంటే జగన్ నిర్లక్ష్యపు దోరణే కారణమని అన్నారు.