అనంత : షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

అనంతపురంలోని కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డు పిల్లిగుండ్ల కాలనీలో ఒక ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికంగా ఉన్న డీపీతో పాటు ఇంటి మీటర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇంట్లోని ఫర్నిచర్, ఫ్రిడ్జ్, టీవీ, ఫ్యాన్, లైట్లు సహా మొత్తం ఆస్తి అగ్నికి ఆహుతి అయింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్