పేకాట స్థావరంపై దాడి.. 18 మంది అరెస్టు

కంబదూరు మండలం కూరాకులపల్లి శివారులో పేకాట స్థావరంపై ఎస్సై లోకేశ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 18 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 25,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్