మాజీ ఎంపీ తలారి రంగయ్యతో పాటు మరో 10 మందిపై కేసు

కళ్యాణదుర్గం పోలీసులు మాజీ ఎంపీ తలారి రంగయ్యతో పాటు మరో 10 మందిపై కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' పేరుతో రంగయ్య ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ కారణంగా ప్రజలకు, వాహనదారులకు ఆటంకం కలిగిందని కానిస్టేబుల్ లింగరాజు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్