గండబోయనపల్లి టోల్ గేట్ సిబ్బందిపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు దాడి చేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనేజర్‌ను కాళ్లతో తన్నడం, మహిళా సిబ్బంది జుట్టు పట్టుకుని కొట్టడం వంటి వీడియోలు వైరల్ కావడంతో స్పందించిన సీఎం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఉపేక్షించబోమని, విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.