కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి, నారాయణపురం, బోయలపల్లి, కొత్తూరు గ్రామాల్లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వైకాపా ఐదేళ్లు ఏం చేసిందని, కొండగుట్టలు తవ్వేస్తూ అక్రమ సంపాదనకే సమయం సరిపోయిందని దుయ్యబట్టారు. అనంతరం ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.