దుర్గం: తాగునీటి కోసం గ్రామ సచివాలయానికి తాళం వేసి నిరసన

కుందుర్పి మండలం బసాపురంలోని పలు కాలనీలకు చెందిన మహిళలు తాగు నీరు అందడం లేదని సోమవారం ఆందోళన చేపట్టారు. గ్రామ సచివాలయ సిబ్బందిని లోపలే పెట్టి కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. నీటిని సరఫరా చేసేంతవరకూ సచివాలయం తాళం తీయమని అక్కడే బైఠాయించారు. ఇన్ ఛార్జి కార్యదర్శి అశోక్, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు మహిళలతో చర్చించి రెండురోజుల్లో తాగునీరందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించి తాళాలు తీశారు.

సంబంధిత పోస్ట్