దుర్గం: అనుమానం పెనుభూతమై భార్య తలపై కొడవలితో నరికిన భర్త

కళ్యాణదుర్గంలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. బ్రహ్మసముద్రం మండలం కొండాపురం గ్రామానికి చెందిన లక్ష్మి, ఈశ్వరయ్య దంపతులు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు. భార్య లక్ష్మిపై అనుమానంతో తరచూ వేధించే ఈశ్వరయ్య, ఆదివారం గొడవలో ఆవేశానికి లోనై ఇంట్లో ఉన్న కొడవలితో లక్ష్మి తలపై నరికి అక్కడి నుంచి పరారయ్యాడు. పట్టణ సీఐ హరినాథ్ ఘటనా స్థలానికి చేరుకుని, లక్ష్మిని కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్