దుర్గం: ద్విచక్రవాహనాలు ఢీ - ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు

శనివారం కళ్యాణదుర్గం మండలం గూబనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విట్లంపల్లికి చెందిన అశోక్, ముక్కన్న పని నిమిత్తం వెళ్తుండగా, గుమ్మఘట్ట మండలం బేలోడుకి చెందిన కుమారస్వామి రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం వైపు వస్తున్నాడు. గూబనపల్లి వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అశోక్, ముక్కన్న, కుమారస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ కుమారస్వామి మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్