విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవడానికి, వారి సంక్షేమానికి సమష్టిగా కృషి చేయాలని పెన్షనర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు మల్లికార్జున తిప్పేస్వామి పేర్కొన్నారు. శుక్రవారం పెన్షన్ భవన్ లో నిర్వహించిన పెన్షనర్ల సమావేశంలో రిటైర్డ్ టీచర్లు ఆదినారాయణ, పద్మావతి సంఘానికి రూ. 10 వేల చొప్పున విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు పెన్షనర్లు పాల్గొన్నారు.