మాజీ సీఎం జగన్ ను కలిసిన తలారి రంగయ్య

కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పరిరక్షణ కోసం తలపెట్టిన లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమం గురించి జగన్‌కు వివరించారు. ఈ సందర్భంగా, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పరిరక్షణ కోసం ఇప్పటివరకు చేపట్టిన ఉద్యమాలు, పోరాటాల గురించి తలారి రంగయ్య తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి తలారి రంగయ్య భుజాన్ని తట్టి 'గో హెడ్' అని ప్రోత్సహించారు.

సంబంధిత పోస్ట్