శెట్టూరు మండలంలో భూగర్భ జలాలు రోజురోజుకు తగ్గిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనుకూరు, అనుంపల్లి, బసంపల్లి గ్రామాల్లో రబీ సీజన్లో వేరుశనగ, టమోటా, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేసిన రైతులు, గత ఖరీఫ్లో వర్షపాతం తక్కువగా ఉండటంతో బోరుబావుల్లో నీరు అడుగంటిపోయిందని తెలిపారు. సుమారు 800 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా ప్రయోజనం లేదని, పాలకులు చెరువులను నీటితో నింపి ఆదుకోవాలని రైతులు గురువారం కోరారు.