కుందుర్పి మండలంలో శుక్రవారం ఎస్సై మహేశ్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో నలుగురు మట్కా నిర్వాహకులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 19,250 నగదును స్వాధీనం చేసుకున్నారు. కుందుర్పి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా జూదాలు జరుగుతున్నట్లయితే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను ఎస్సై కోరారు.