ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దళిత గిరిజనులపై దాడులు, దౌర్జన్యాలు అరికట్టడంలో ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు కృషి చేయడం లేదని, పట్టించుకోవడంలేదని ఎస్సీ ఎస్టీ జేఏసీ చెలమప్ప ఆదివారం విలేఖరులతో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శెట్టూరు మండలం మాకోడికి గ్రామంలో మొహరం పండుగ రోజున మొక్కులు సమర్పించడానికి వచ్చిన దళితులను అవమానించడం చాలా బాధాకరం అన్నారు. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.