కళ్యాణదుర్గం రెవెన్యూ కాలనీలో బుధవారం రాత్రి 8:30 గంటలకు విద్యుత్ తీగ తెగిపడింది. స్థానికులు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేయగా, సంఘటనా స్థలానికి చేరుకున్న విద్యుత్ సిబ్బంది రవిశంకర్, అశోక్ రోడ్డుపై వేలాడుతున్న తీగలను చూసి స్వచ్ఛందంగా మరమ్మతులు చేపట్టారు. వారి సత్వర చర్యలతో ప్రమాదం తప్పింది. దీంతో కాలనీవాసులు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.