కళ్యాణదుర్గం: ఉత్సాహంగా రాతిదూలం లాగుడు పోటీలు

కుందుర్పి మండలంలోని అపిలేపల్లిలో మంగళవారం బొబ్బిళ్లకుంట ఆంజనేయస్వామి రథోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్రస్థాయి రాతిదూలం లాగుడు పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మద్దెలచెరువు, తోపుదుర్తి గ్రామాలకు చెందిన వృషభాలు ప్రథమ బహుమతిని గెలుచుకున్నాయి. ఒక్కో జట్టుకు రూ. 25వేల నగదు బహుమతిని అందజేశారు. మూడో బహుమతిగా గార్లదిన్నె వృషభాలకు రూ. 20వేలు దక్కాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ మండల కన్వీనర్ రామాంజినేయులు, టీడీపీ గ్రామ కన్వీనర్ ఈరన్న, సర్పంచ్ భర్త అతావుల్లా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్