శెట్టూరు మండలంలో రబీ సీజన్‌లో బోరుబావుల కింద సాగుచేసిన వేరుశనగ పంట పొగమంచు కారణంగా తిక్కాకు తెగులు, అగ్ని పచ్చపురుగు తెగుళ్లతో తీవ్రంగా నష్టపోయింది. సాగుచేసిన నెల రోజుల్లోనే నాలుగుసార్లు మందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేకపోయిందని రైతులు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, వ్యవసాయాధికారిణి వాసుకీరాణి వేరుశనగలో మచ్చ తెగుళ్ల నివారణకు కాంటాప్ 2ఎంఎల్ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని, ఆగ్గి తెగులుకు ప్రొక్నోపాస్ రెండు ఎంఎల్ మందును ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు.