కళ్యాణదుర్గం ఎక్సైజ్ కార్యాలయంలో మహిళా అధికారిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. కర్ణాటక మద్యం విక్రయదారుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో పాటు సిబ్బందితో సక్రమంగా లేకపోవడం, దురుసు ప్రవర్తనతో విసిగిపోయిన సిబ్బంది సెలవులకు వెళ్తున్నారు. ఉన్నవారు కూడా విధులు నిర్వహించలేక సతమతమవుతున్నారని చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రేవతి మంగళవారం విచారణ జరిపారు.