కళ్యాణదుర్గం పట్టణంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. సబ్ రిజిస్ట్రార్ రామ్మోహన్ నాయుడుకు సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లు, రైతులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో నియోజకవర్గ ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని సబ్ రిజిస్ట్రార్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు పాల్గొన్నారు.