కుందుర్పి మండలం తమ్మయ్యదొడ్డి గ్రామంలో కోడి కూతలు వినిపించవని గ్రామ ప్రజలు గురువారం తెలిపారు. సుమారు వందేళ్ల క్రితం గ్రామంలో నెలకొన్న అరిష్టాలను నివారించడానికి పెద్దలు కోడి మాంసం తినకూడదని, కోళ్లను పెంచకూడదని నియమం విధించారు. ఈ నియమాన్ని ఇప్పటికీ ఆ గ్రామస్థులు పాటిస్తున్నారు. 60 కుటుంబాలకు చెందిన 450 మంది ఈ గ్రామంలో నివసిస్తున్నారు. అయితే, వీరు మేకలు, గొర్రెలను పెంచుకుంటూ మటన్ తింటారు.