కల్యాణదుర్గం: ఖననం చేసిన మృతదేహానికి పంచనామా

కల్యాణదుర్గం మండలం పాతచెరువు గ్రామంలో భార్య సుకన్య తన భర్త హనుమంతుడిని నాలుగు నెలల క్రితం రోకలిబండతో కొట్టి హత్య చేసింది. అనుమానం రాకుండా ఇంటిముందే మృతదేహాన్ని పాతిపెట్టింది. ఈ ఘటన మూడు రోజుల క్రితం వెలుగులోకి రావడంతో, ఆదివారం డీఎస్పీ రవిబాబు, సీఐ గణేశ్, తహసీల్దార్ భాస్కర్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. హత్యలో ఇంకా ఎవరి ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని డీఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్