కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మల నరికివేతతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి శనివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు కరెంటు సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ రాజశేఖర్ తెలిపారు. కళ్యాణదుర్గం పట్టణం, మండలం, కుందుర్పి, బెళుగుప్ప మండలాల్లో విద్యుత్తు సరఫ రాకు అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలన్నారు.