కుందుర్పి మండలంలోని అపిలేపల్లికి చెందిన ప్రకృతి వ్యవసాయదారులు అతావుల్లా, చిరంజీవి, తిప్పేస్వామిలను డైరెక్టర్ వైవీ మల్లారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీసు కాంప్లెక్స్ భవనంలో శుక్రవారం సన్మానించారు. అపిలేపల్లిలో ఏఎఫ్ ఎకాలజీ ప్రభుత్వ అనుసంధానంతో 168 ఎకరాల్లో ఐదు రకాల పండ్లను ప్రకృతి వ్యవసాయం ద్వారా విజయవంతంగా సాగు చేసినందుకు ఈ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా వారి కృషిని అభినందించారు.