కుందుర్పి మండలం నిజవళ్లి గ్రామానికి చెందిన రేఖశ్రీ అనే యువతి, తల్లిదండ్రులు ఒప్పుకున్న సంబంధం ఇష్టం లేక క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఇంట్లోనే పురుగుల మందు తాగిన ఆమెను తల్లిదండ్రులు కుందుర్పి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.