కళ్యాణదుర్గం: సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం

కృష్ణగౌడ్ తన స్నేహితుడు వెంకటేష్ కు రూ. 15 లక్షలు అప్పుగా ఇచ్చాడు. డబ్బు తిరిగి అడిగినా వెంకటేష్ పట్టించుకోకపోవడంతో, పది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు. తీవ్ర మనస్తాపానికి గురైన కృష్ణగౌడ్, సోమవారం కళ్యాణదుర్గం పట్టణ శివారులోని కన్నేపల్లి అటవీప్రాంతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. స్నేహితుడు వెంకటేశ్, ప్రకాశ్, జయమ్మలే దీనికి కారణమని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.

సంబంధిత పోస్ట్