కళ్యాణదుర్గం: గొర్రెల సంత పునఃప్రారంభం

కళ్యాణదుర్గం పట్టణంలోని మార్కెట్ యార్డులో దాదాపు పది సంవత్సరాల తర్వాత శుక్రవారం గొర్రెల సంతను పునఃప్రారంభించారు. గొర్రెలు, మేకలు, పశువుల కొనుగోలు, అమ్మకాలకు ఈ యార్డును రైతులు, కాపరులు వినియోగించుకోవాలని మార్కెట్ యార్డు చైర్పర్సన్ లక్ష్మీదేవి, వైస్ చైర్మన్ కోనంకి రాజశేఖర్ తెలిపారు. ఎవరూ ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ వంశీకృష్ణ భార్గవ్, మార్కెట్ యార్డు డైరెక్టర్లు, టీడీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్