కళ్యాణదుర్గం: వైభవంగా సీతారాముల కల్యాణం

కళ్యాణదుర్గం పట్టణంలో శ్రీ పట్టాభిరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ సీతారాముల కల్యాణమహోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం మహిళలు ప్రధాన రహదారిపై ముగ్గుల పోటీలు నిర్వహించారు. సాయంత్రం పట్టణ పురవీధుల్లో గరుడ వాహనంపై స్వామి వారి ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపులో అన్నమయ్య రామదాసు కీర్తనలతో పాటు చిన్నారుల కోలాటం, భరతనాట్యం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్