కళ్యాణదుర్గం పట్టణంలోని వైసిపి పార్టీ కార్యాలయంలో శనివారం వైసిపి నాయకులు, కార్యకర్తలు కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ తాము ప్రతిపక్షమని, ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య, వైసీపీ కార్యకర్తలను బెదిరించే విధంగా ఎమ్మెల్యే సురేంద్ర బాబు మాట్లాడారన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 100 బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.