కళ్యాణదుర్గం పట్టణంలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం జనాభా దినోత్సవం నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హర్షలత మాట్లాడుతూ ప్రపంచ జనాభా 800కోట్లకు చేరుకుందన్నారు. జనాభా పెరుగుతూనే ఉందని, దీనిని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. జనాభా పెరుగుదల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరించారు.