కళ్యాణదుర్గం మండలం శీబాయి వద్ద గురువారం ఆటోను ప్రైవేటు అంబులెన్స్ ఢీకొనడంతో ఆటోడ్రైవర్ ఈరలింగప్ప దుర్మరణం పాలయ్యాడు. కుందుర్పి మండలం అల్లాపురం నుంచి బాడుగ నిమిత్తం ఆటోలో అనంతపురం వెళ్తున్నాడు. రాయదుర్గానికి చెందిన ప్రైవేటు అంబులెన్స్ లో రోగిని తీసుకెళ్తుండగా, శీబాయి వద్ద ముందు వెళ్తున్న ఆటోను అంబులెన్స్ ఢీకొనడంతో ఈరలింగప్ప తీవ్రంగా గాయపడ్డాడు. అనంతపురం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు.