కళ్యాణదుర్గం: టీడీపీ జెండా స్తంభాన్ని కూల్చిన ఆకతాయిలు

కుందుర్పిలో స్థానిక ప్రధాన రహదారి పక్కన ఉన్న టీడీపీ జెండా స్తంభాన్ని కొందరు ఆకతాయిలు ధ్వంసం చేశారు. గురువారం ఉదయం ఈ సంఘటన వెలుగులోకి రావడంతో, స్థానిక టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆకతాయిల చర్యల వల్ల పార్టీల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.

సంబంధిత పోస్ట్