చోళ రాజులు నిర్మించిన కంబదూరు శివాలయంలో మంగళవారం తెల్లవారుజామున శివుడికి అభిషేకాలు, కుంకుమార్చన, ప్రత్యేక పూజలతో అలంకరణ నిర్వహించారు. భక్తులు మల్లికార్జునస్వామిని భస్మ లేపనం, ఆకులపూజ అలంకరణలో దర్శించుకున్నారు. ప్రమిదలలో కార్తీకదీపాలు వెలిగించి, భీమరాయుడు, గణపతి, వీరభద్రస్వామి, పార్వతి అమ్మవార్లకు, వృక్షాలకు, నాగులకు, నంది విగ్రహాలకు, కమల మల్లేశ్వర స్వామికి పూజలు చేసి నైవేద్యం స్వీకరించారు.