కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు శనివారం తన స్వగృహంలో క్లస్టర్ సభ్యులు, బూత్ లెవల్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని, కొత్త ఓటర్లను చేర్పించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా టీడీపీ సానుభూతిపరుల పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో జాగ్రత్తగా చూసుకోవాలని ఆదేశించారు. సర్వేపై అవగాహన పెంచుకోవాలని కూడా సూచించారు.