కళ్యాణదుర్గం: పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు

కుందుర్పి మండలంలోని కదరంపల్లి గ్రామ సమీపంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. శనివారం అందిన సమాచారం మేరకు ఎస్ఐ మహేష్ తన సిబ్బందితో కలిసి ఈ దాడి నిర్వహించారు. ఈ ఘటనలో ఏడుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 6010 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మండలంలో ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్లు సమాచారం వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్