కళ్యాణదుర్గం పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో నూతన సంవత్సర గురువారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని వివిధ పుష్పాలతో అలంకరించి, శాంతి హోమాలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొని, నూతన సంవత్సర శుభవేళ ప్రత్యేక పూజలు, అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు.