కంబదూరు మండలం చెన్నంపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు గాయాలైన ఘటన సోమవారం చోటుచేసుకుంది. కదిరిదే వరపల్లికి చెందిన గణేష్, చైతన్య, కోటగుడ్డకు చెందిన వంశీ కియా కంపెనీలో విధుల నిమిత్తం ద్విచక్ర వాహనంలో పేరూరు మీదుగా వెళ్తుండగా వాహనం అదుపు తప్పి కింద పడ్డారు. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కంబదూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడినుంచి కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు.