కంబదూరు మండలంలోని అండేపల్లిలో రెండు సెంట్ల భూమిని అక్రమంగా రిజిస్టర్ చేసేందుకు తహసీల్దార్ బాలకిషన్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. రిజిస్ట్రేషన్ సమయంలో అనుమానం వచ్చిన సబ్ రిజిస్ట్రార్ అసలైన పత్రాన్ని తహసీల్దార్కు పంపగా, అది తన సంతకం కాదని బాలకిషన్ గుర్తించారు. దీనిపై ఆయన బుధవారం స్థానిక ఎస్సై ప్రవీణ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.