కంబదూరు మండలం నూతన విద్యాశాఖాధికారిగా ఉమాపతి గురువారం పదవీ భాద్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులకు ఉపాధ్యాయులు విద్య నేర్పించే విధానంలో మెలుకువలు పాటించాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఉపాధ్యాయులు అలసత్వం పాటించకుండా విద్యార్థులకు విద్య బోధించాలన్నారు.