శెట్టూరు మండలం ముచ్చర్లపల్లికి చెందిన వెంకటేశ్, కర్ణాటక పావగడ తాలూకా కత్నహళ్లి గ్రామానికి చెందిన మంజుల ప్రేమలో పడారు. పెద్దలు వారి ప్రేమకు అంగీకరించలేదు. దీంతో శుక్రవారం వారు శెట్టూరు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సమాచారం అందుకుని కూటమి నేతలు పెద్దలను ఒప్పించి ఈ జంటకు వివాహం జరిపించారు.