కళ్యాణదుర్గం మండలం పాత చెరువులో జరిగిన హనుమంతు హత్య కేసులో మృతుడి కుమారుడు సందీప్ సంచలన ఆరోపణలు చేశారు. తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని తల్లి సుకన్యే తండ్రిని హత్య చేసి, ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టిందని ఆయన పేర్కొన్నారు. తండ్రి వేరే అమ్మాయితో వెళ్లిపోయాడని తమను నమ్మించిందని సందీప్ ఆవేదన వ్యక్తం చేశారు.