నవంబర్ 8న కళ్యాణదుర్గంలో జరగనున్న భక్త కనకదాస జయంతి, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. గురువారం వెల్లడించిన సమాచారం ప్రకారం, ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.