విద్యుదాఘాతంతో ఒకరు మృతి

కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామంలో మొక్కజొన్న కోత యంత్రాన్ని పైకి ఎక్కి శుభ్రం చేస్తున్న బసవరాజు (35) అనే వలస కూలీ విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బళ్లారి జిల్లా సింధువలం గ్రామానికి చెందిన బసవరాజు, 15 రోజుల క్రితం కూలీ పనుల నిమిత్తం చాపరి గ్రామానికి వచ్చాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్