శనివారం కళ్యాణదుర్గం పట్టణంలో సామాజిక తత్వవేత్త, స్వరకర్త, కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాస 538వ జయంతి రాష్ట్ర ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. బైపాస్ సర్కిల్ కు శ్రీ భక్త కనకదాస సర్కిల్ గా నామకరణం చేశారు.