కళ్యాణదుర్గం మండలం గూబనపల్లి వద్ద హైవే మలుపు ప్రమాదకరంగా మారి, వరుస దుర్ఘటనలకు నిలయమైంది. ఇటీవల జరిగిన ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. దీనికి ముందు 15 రోజుల క్రితం రెండు బైకులు ఢీకొని ఒకరు మరణించగా, నెల రోజుల క్రితం ట్రాక్టర్, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదకరమైన మలుపు వద్ద తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు పోలీసులను కోరుతున్నారు.