కొనగండ్ల గ్రామానికి త్రాగునీటి సరఫరా, గ్రామంలో పలు ప్రాంతాలకు పైప్ లైన్ డిస్ట్రిబ్యూషన్, సత్య సాయి వాటర్ సప్లై అంశాలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం తన క్యాంప్ ఆఫీస్‌లో సత్య సాయి వాటర్ బోర్డు అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ప్రాంతం పూర్తిగా కవరయ్యేలా పైప్లైన్ వ్యవస్థను రూపుదిద్దుకోవాలని, హెచ్ఎన్ఎస్ఎస్ నీటి పంపింగ్ జరిగేలా, సదరు పనులన్నీ రానున్న జనవరి 15 నాటికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.