సెట్టూరు మండలం యాటకల్లు గ్రామానికి చెందిన విజయ్ (32) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు వివాహం కావడం లేదని గత కొంత కాలంగా మనస్తాపంతో ఉన్నారు. ఈక్రమంలో తాగుడుకు కూడా బానిసయ్యాడు. ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించగా కుటుంబీకులు కాపాడారు. ఈక్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.