తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన

రాజధాని మూడు చోట్ల పెడుతున్నామని గందరగోళం

కళ్యాణదుర్గం పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాజధాని మార్పు చేయకూడదు అంటూ కాగడాల ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజధాని అమరావతిని విచ్ఛిన్నం చేయడానికి వైసిపి కుట్రపన్నుతోందని దీనిని ప్రజలు సహించరని అన్నారు. రాజధాని మూడు చోట్ల పెడుతున్నామని గందరగోళం సృష్టించి అమరావతి రైతులు ధర్నా చేస్తున్నా కూడా 144 సెక్షన్ విధించి వారిని కట్టడి చేయడం మంచిది కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ మున్సిపల్ చైర్మన్ వై పి రమేష్, టిడిపి సీనియర్ నాయకులు బి కే గోవిందప్ప, టిడిపి పట్టణ అధ్యక్షుడు మురళి, డీకే రామాంజనేయులు, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్