అమరాపురం మడకశిర రహదారిపై తప్పిన ప్రమాదం

మంగళవారం అమరాపురం మండలం కుంభరనాగేపల్లి నుండి మడకశిర వెళ్లే ప్రధాన రహదారిపై ఒక భారీ వృక్షం కూలిపోయింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో వృక్షం అడ్డంగా పడిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు వెంటనే స్పందించి వృక్షాన్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్