మడకశిర సీఐ సుబ్రహ్మణ్యం పట్టణ ప్రజలకు రోడ్డు భద్రతపై కీలక సూచనలు చేశారు. బైక్ స్టంట్లు చేసేవారి వివరాలు అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కూడా ప్రమాదం జరిగితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. రోడ్డు భద్రతపై అందరూ సహకరించాలని ఆయన కోరారు.